Asia Cup 2025: శాంసన్ హాఫ్ సెంచరీ..ఓమన్ పై ఇండియా విక్టరీ
ఓమన్ పై ఇండియా విక్టరీ
Asia Cup 2025: ఆసియా కప్‌లో భాగంగా ఓమన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తా చాటింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. సంజు శాంసన్ (56 పరుగులు) అద్భుతమైన అర్ధ సెంచరీతో రాణించగా, అభిషేక్ శర్మ (38 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో తిలక్ వర్మ (29) వేగంగా పరుగులు సాధించాడు.
189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఓమన్, భారత బౌలర్లను ప్రతిఘటించింది. ఆమిర్ కలీమ్ (64), హమ్మద్ మీర్జా (51) హాఫ్ సెంచరీలతో పోరాడారు. అయితే, భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో ఓమన్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది.
ఈ మ్యాచ్లో అర్ష్‌దీప్ సింగ్ టీ20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్న తొలి భారత బౌలర్ గా రికార్డు సృష్టించారు.ఈ విజయంతో భారత్ గ్రూప్ దశలో అజేయంగా నిలిచి, సూపర్ 4 దశకు చేరుకుంది. ఈ మ్యాచ్ లో ఓమన్‌కు చెందిన షా ఫైసల్, జితేన్ రామనంది మరియు ఆమిర్ కలీమ్ తలో 2 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేశారు.