Ausis Tour: ఆసిస్ జైత్రయాత్రకు బ్రేక్..ఇండియా గ్రాండ్ విక్టరీ
ఇండియా గ్రాండ్ విక్టరీ
Ausis Tour: గత రాత్రి ముల్లాన్‌పూర్‌లో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. స్మృతి మంధాన సెంచరీ చేయడంతో
102 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-1తో సమంగా నిలిచింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 49.5 ఓవర్లలో 292 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన అద్భుతమైన సెంచరీతో (117 పరుగులు) విజయంలో కీలక పాత్ర పోషించింది.
టార్గెట్ చేజింగ్ లో ఆస్ట్రేలియా ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. క్రాంతి గౌడ్ (3 వికెట్లు), దీప్తి శర్మ (2 వికెట్లు)ల అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఆస్ట్రేలియా జట్టు 40.5 ఓవర్లలో కేవలం 190 పరుగులకే ఆలౌట్ అయింది.
ఈ గెలుపుతో మహిళల క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగుల తేడాతో భారత్ గెలిచింది మంధానకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డే సెప్టెంబర్ 20న ఢిల్లీలో జరగనుంది.