Team India’s Squad for the Third Test: ఆ ఇద్దరిపై వేటు.. మూడో టెస్టుకు టీమిండియా జట్టు ఇదేనా?

మూడో టెస్టుకు టీమిండియా జట్టు ఇదేనా?;

Update: 2025-07-08 05:40 GMT

Team India’s Squad for the Third Test:  బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌పై 336 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ, మూడో టెస్ట్ కోసం భారత్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో భారీ మార్పులు ఉంటాయని తెలుస్తోంది. మూడో టెస్ట్ జూలై 10 నుండి 14 వరకు లార్డ్స్‌ వేదికగా జరుగుతుంది. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వస్తాడు. రెండు టెస్టుల్లోనూ పరుగులు ఇవ్వడంలో పేలవమైన రికార్డు ఉన్న ప్రసీద్ కృష్ణను జట్టు నుంచి తొలగించే అవకాశం ఉంది. ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని ప్లేయింగ్ ఎలెవన్ నుండి తొలగించవచ్చు అని సమాచారం.

మూడో టెస్ట్ కోసం నితీష్ స్థానంలో కుల్దీప్ యాదవ్ లేదా అర్ష్‌దీప్ సింగ్‌ను తీసుకోవచ్చు. బర్మింగ్‌హామ్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో, శుభ్‌మాన్ గిల్ నితీష్‌ను బౌలింగ్ చేయడానికి ఉపయోగించుకోలేదు. బ్యాటింగ్‌లో, అతను రెండు ఇన్నింగ్స్‌లలో 1 పరుగు మాత్రమే చేశాడు. ఇక కరుణ్ నాయర్ రెండు టెస్టుల్లో విఫలమైప్పటికీ అతన్ని జట్టు నుండి తొలగించే అవకాశం లేదు. ఎందుకంటే ఆ స్థానానికి సరైన ఆటగాడు జట్టులో లేడు. అలాగే, అతనికి మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉంది. అయితే, భారత 18 మంది సభ్యుల జట్టులో ధ్రువ్ జురెల్, అభిమన్యు ఈశ్వరన్ వంటి ప్రభావవంతమైన ఆటగాళ్ళు ఉండటంతో, కరుణ్ నాయర్‌కు లార్డ్స్ టెస్ట్ నుండి గేట్ పాస్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు.

భారత ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్: యస్సవి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్/అర్షదీప్ సింగ్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా

Tags:    

Similar News