BCCI: రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కోహ్లీకి బీసీసీఐ షాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌!

బీసీసీఐ షాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌!

Update: 2026-01-21 05:53 GMT

BCCI: బీసీసీఐ సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంట్రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరోసారి క్రమబద్ధీకరించడానికి బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 2018లో ప్రవేశపెట్టిన ఎ+ కేటగిరీని పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కేవలం ఎ, బి, సి కేటగిరీలను మాత్రమే కొనసాగించాలని చూస్తోంది. ఒకవేళ అదే జరిగితే ఎ+ కేటగిరీలో ఉన్న స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెటర్లు రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ, విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీకి గట్టి షాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగలనుంది. ఎందుకంటే ఈ ఇద్దరు ప్రస్తుతం ఒకే ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆడుతున్నారు. అప్పట్లో మూడు ఫార్మాట్లలో ఆడుతున్న ప్లేయర్లను మాత్రమే ఎ+లో చేర్చారు. రో–కోతో పాటు జడేజా, బుమ్రా ఇందులో ఉన్నారు. వీళ్ల నలుగురికి ఏడాదికి రూ. 7 కోట్ల చొప్పున చెల్లించారు. ఇప్పుడు ఈ కేటగిరీని తీసేస్తుండటంతో రో–కోను బిలోకి మార్చే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం బుమ్రా ఒక్కడే మూడు ఫార్మాట్లు ఆడుతున్నాడు. దాంతో అతనికి చెల్లించే డబ్బుల విషయంలో ఎలాంటి తేడా ఉండదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. వచ్చే అపెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమావేశంలో కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. గతంలో ఎ గ్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ. 5 కోట్లు, బికి రూ. 3, సి గ్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కోటి రూపాయల చొప్పున చెల్లించారు. మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గూగుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏఐ ఫ్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెమిని నుంచి రూ. 270 కోట్ల స్పాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లభించింది. మూడేళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. డబ్ల్యూపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీపీటీ స్పాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తోంది.

Tags:    

Similar News