BCCI: రోహిత్, కోహ్లీకి బీసీసీఐ భారీ షాక్..సెంట్రల్ కాంట్రాక్టులో మార్పులు

సెంట్రల్ కాంట్రాక్టులో మార్పులు

Update: 2026-02-10 04:26 GMT

BCCI: బీసీసీఐ 2025-26 సీజన్‌కు సంబంధించి తాజాగా ప్రకటించిన వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్‌లలో భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు 'గ్రేడ్ బి'కి డిమోషన్ లభించింది.

ఇది క్రికెట్ అభిమానులకు ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ, దీని వెనుక కొన్ని కీలక మార్పులు ఉన్నాయి. గతంలో ఉన్న అత్యున్నత కేటగిరీ 'గ్రేడ్ A+'ను బీసీసీఐ ఈసారి పూర్తిగా తొలగించింది. ప్రస్తుతం 'గ్రేడ్ A' నే అత్యున్నత కేటగిరీగా మారింది.రోహిత్, కోహ్లీలు ప్రస్తుతం టీ20, టెస్ట్ ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించి, కేవలం వన్డేలకు (ODI) మాత్రమే పరిమితం కావడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. మూడు ఫార్మాట్లు ఆడేవారికే గరిష్ట ప్రాధాన్యత ఇవ్వాలనే నిబంధన దీనికి ప్రధాన కారణం.

గ్రేడ్ A లో కేవలం ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే గ్రేడ్ A లో చోటు దక్కించుకున్నారు. వీరిలో శుభ్‌మన్ గిల్ (టెస్ట్ & వన్డే కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు. వీళ్లకు రూ.5కోట్ల వార్షిక వేతనం లభిస్తుంది. .

గ్రేడ్ బీలో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, కె.ఎల్. రాహుల్, సూర్యకుమార్ యాదవ్, సిరాజ్, కుల్దీప్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్ లకు రూ. 3 కోట్లు లభిస్తుంది. గ్రేడ్ Cలో ఉన్న అక్షర్ పటేల్, రింకూ సింగ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్ తదితర 16 మందికి ఏడాదికి కోటి లభిస్తుంది. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, యువ ఆటగాడు ఇషాన్ కిషన్లకు ఈసారి కాంట్రాక్ట్ జాబితాలో చోటు దక్కలేదు.

Tags:    

Similar News