BCCI : ఇండియా విక్టరీపై బీసీసీఐ రౌండప్ వీడియో
బీసీసీఐ రౌండప్ వీడియో
BCCI : ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై టీమ్‌ఇండియా సాధించిన విజయంపై బీసీసీఐ (BCCI) ఒక రౌండప్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో మ్యాచ్‌లోని ముఖ్య ఘట్టాలను, ఆటగాళ్ల ప్రదర్శనను హైలైట్ చేశారు.
భారత ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ అద్భుతంగా రాణించారని బీసీసీఐ ఈ వీడియోలో చూపించింది.పాకిస్తాన్‌పై టీమ్‌ఇండియా అన్ని విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిందని బీసీసీఐ తెలిపింది.
ఈ విజయాన్ని పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు అంకితం చేస్తున్నట్లుగా భారత జట్టు పోరాడింది అని బీసీసీఐ తన వీడియోలో తెలిపింది.బీసీసీఐ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం అభిమానుల మధ్య బాగా ట్రెండ్ అవుతోంది.
భారత జట్టు పాకిస్తాన్ ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 14న దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు, భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి 3 వికెట్లు పడగొట్టాడు.128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత జట్టు, కేవలం 15.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.