Bharat Arun: లక్నో బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్

బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్;

Update: 2025-07-31 07:03 GMT

Bharat Arun: టీమిండియా బౌలింగ్ మాజీ కోచ్ భరత్ అరుణ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తమ కొత్త బౌలింగ్ కోచ్‌గా నియమించుకుంది. గత నాలుగు సీజన్‌లుగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన భరత్ అరుణ్, ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ లో చేరాడు. దీంతో లక్నో ఫ్రాంచైజీ భవిష్యత్తులో కొన్ని మార్పులు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.గత సీజన్‌లో జట్టు పేలవమైన ప్రదర్శన కారణంగా, ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్, మెంటర్ జహీర్ ఖాన్ భవిష్యత్తుపై సందేహాలు నెలకొన్నాయి.

భరత్ అరుణ్ హిస్టరీ

భరత్ అరుణ్ భారత జాతీయ క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్‌గా రెండుసార్లు పనిచేశారు.

అతని శిక్షణలో భారత ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ గణనీయంగా మెరుగుపడింది.

అతను ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కూడా బౌలింగ్ కోచ్‌గా పనిచేశారు.

2024 IPL సీజన్‌లో KKR ఛాంపియన్‌షిప్ గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు.

Tags:    

Similar News