Jasprit Bumrah: అరుదైన రికార్డుకు అడుగు దూరంలో బుమ్రా
అడుగు దూరంలో బుమ్రా
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నారు. ఇంగ్లండ్‌తో జరగనున్న ఈ సెమీఫైనల్‌లో బుమ్రా ఒక్క వికెట్ తీస్తే, అంతర్జాతీయ క్రికెట్లో 500 వికెట్లు తీసిన 8వ భారత బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తారు. బుమ్రా ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 499 వికెట్లు తీశారు. బుమ్రా కేవలం 10 ఏళ్ల లోపే ఈ ఘనతను సాధించడం విశేషం. టెస్టుల్లో52 మ్యాచ్‌ల్లో 234 వికెట్లు, వన్డేల్లో 89 మ్యాచ్‌ల్లో 149 వికెట్లు, టీ20ల్లో 93 మ్యాచ్‌ల్లో 116 వికెట్లు ఉన్నాయి.
బుమ్రా కంటే ముందు 500 వికెట్ల క్లబ్‌ల భారత ఆటగాళ్లలో అనిల్ కుంబ్లే (956), రవిచంద్రన్ అశ్విన్ (765), హర్భజన్ సింగ్ (711), కపిల్ దేవ్ (687), రవీంద్ర జడేజా (634), జహీర్ ఖాన్ (610), జవగళ్ శ్రీనాథ్ (551) ఉన్నారు. ఈ క్లబ్‌లో చేరడం ద్వారా బుమ్రా భారత దిగ్గజాల సరసన నిలుస్తారు.
ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుండటం బుమ్రాకు మరింత కలిసివచ్చే అంశం. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఇక్కడే ఎన్నో వికెట్లు తీసిన అనుభవం ఆయనకు ఉంది. మైఖేల్ వాఘన్ అంచనాలను తలకిందులు చేస్తూ బుమ్రా ఈ మైలురాయిని అందుకోవడమే కాకుండా, భారత్‌ను ఫైనల్‌కు చేరుస్తాడని కోట్లాది మంది అభిమానులు ఆశిస్తున్నారు.