Nitish Kumar Reddy Injured: టీమిండియాకు బిగ్ షాక్.. నితీశ్ కుమార్‌రెడ్డికి గాయం!
నితీశ్ కుమార్‌రెడ్డికి గాయం!
Nitish Kumar Reddy Injured: ప్రస్తుతం ఇంగ్లాండ్ సిరీస్‌లో భారత జట్టుకు ఎదురైన మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే జట్టులో ఇతర ఆటగాళ్లకు కూడా గాయాల బెడద ఉంది. తాజాగా నితీష్ కుమార్ రెడ్డికి గాయమైంది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా అతనికి మోకాలికి గాయం అయినట్లు సమాచారం. స్కానింగ్‌లో లిగమెంట్ దెబ్బతిన్నట్లు తేలడంతో, అతను మిగిలిన రెండు టెస్టులకు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. ఈ విషయంలో బీసీసీఐ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో జట్టులో ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో నాలుగో టెస్టుకు శార్దూల్ ఠాకూర్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. బీసీసీఐ త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో భారత్ ఇప్పటికే 1-2 తేడాతో వెనుకబడి ఉంది. ఈ కీలక సమయంలో నితీశ్ కుమార్ రెడ్డి వంటి ఆల్ రౌండర్ గాయపడటం జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ. ఇప్పటికే ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్ వంటి ఇతర పేసర్లు కూడా గాయాలతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. నితీశ్ కుమార్ రెడ్డి రెండో, మూడో టెస్టుల్లో ఆడాడు. లార్డ్స్ టెస్టులో 3 వికెట్లు తీయడంతో పాటు 43 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.