Diamond League: డైమండ్ లీగ్ ..రెండో స్థానంలో నీరజ్

రెండో స్థానంలో నీరజ్

Update: 2025-08-29 06:31 GMT

Diamond League: డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచి రన్నరప్‌గా నిలిచారు. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ ఈ ఈవెంట్‌ను గెలుచుకుని తన మొదటి డైమండ్ లీగ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. నీరజ్ తన ఆరో ( చివరి) ప్రయత్నంలో 85.01 మీటర్ల దూరం విసిరి రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

జర్మనీకి చెందిన జూలియన్ వెబర్, తన రెండో ప్రయత్నంలో 91.51 మీటర్లు విసిరి అద్భుతమైన ప్రదర్శనతో విజేతగా నిలిచారు. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన కెషోర్న్ వాల్కాట్ 84.95 మీటర్లతో మూడో స్థానంలో నిలిచారు.

నీరజ్ చోప్రా 2022లో డైమండ్ లీగ్ ఫైనల్స్‌ను గెలుచుకున్నారు. అయితే ఈసారి ఆయన తన టైటిల్‌ను నిలబెట్టుకోలేకపోయారు. అయినప్పటికీ, ఇది వరుసగా మూడోసారి డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో టాప్-2లో చోటు దక్కించుకున్నారు.

Tags:    

Similar News