Gavaskar on Harmanpreet Kaur: 1983తో పోలిక వద్దు.. హర్మన్‌ప్రీత్ సేన విజయంపై గావస్కర్
హర్మన్‌ప్రీత్ సేన విజయంపై గావస్కర్
Gavaskar on Harmanpreet Kaur: భారత మహిళల జట్టు ఇటీవల వన్డే వరల్డ్ కప్ గెలుచుకోవడంతో, ఈ చారిత్రక విజయాన్ని 1983లో పురుషుల జట్టు కపిల్ దేవ్ నాయకత్వంలో గెలిచిన సందర్భంతో పోల్చడం మొదలైంది. దీనిపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందించారు. ఈ రెండు విజయాలను పోల్చాల్సిన అవసరం లేదని, మహిళల జట్టు భిన్నమైన పరిస్థితులను ఎదుర్కొందని ఆయన అభిప్రాయపడ్డారు.
గావస్కర్ పోలిక
మెన్స్ టీమ్ 1983లో ప్రపంచ కప్ గెలవడానికి ముందు ఒక్కసారి కూడా నాకౌట్ దశకు చేరుకోలేదు. అప్పటివరకు గ్రూప్ స్టేజ్‌కే పరిమితమైంది. మహిళల జట్టు ఈ అద్భుత విజయం సాధించడానికి ముందే 2005, 2017లో రెండుసార్లు వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది. అంటే, వారికి అత్యుత్తమ రికార్డు ఉంది’’ అని గవాస్కర్ అన్నారు. ‘‘1983లో పురుషుల కప్ గెలవడం భారత క్రికెట్‌కు ఊపిరి పోసింది. ప్రపంచమంతా భారత్ గురించి చర్చించుకుంది. ఆ తర్వాతే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునే యువత పెరిగింది. ఐపీఎల్ వచ్చాక క్రికెటర్లు ఆర్థికంగా ఉన్నతస్థాయికి చేరారు. ఇప్పుడు మహిళల జట్టు ప్రపంచకప్ నెగ్గడంతో ఎప్పటినుంచో మహిళల క్రికెట్‌లో ఆధిపత్యం ప్రదర్శిస్తున్న దేశాలను కదిలించినట్లు అవుతుందని గావస్కర్ తెలిపారు.