T20 World Cup Begins Today: ఈ రోజు నుంచే టీ20 వరల్డ్ కప్.. అమెరికాతో ఇండియా తొలి సమరం
అమెరికాతో ఇండియా తొలి సమరం
T20 World Cup Begins Today: ఈరోజే క్రికెట్ పండుగ ICC పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 షురూ..ఈ మెగా టోర్నీకి మన భారత్ , శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. నేటి మొదటి రోజే మన టీమ్ ఇండియా బరిలోకి దిగుతుండటం విశేషం. ఈరోజు మొత్తం మూడు ఆసక్తికరమైన మ్యాచ్‌లు జరగనున్నాయి. పాకిస్తాన్ vs నెదర్లాండ్స్ మ్యాచ్ ఉదయం 11 గంటలకు . వెస్టిండీస్ vs స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు, ( భారత్ vs యునైటెడ్ స్టేట్స్ ,రాత్రి 7 గంటలకు (ముంబై, వాంఖడే స్టేడియం)లో జరగనుంది.
మొత్తం 20 దేశాలు ఈ ప్రపంచకప్‌లో తలపడుతున్నాయి.20 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ దశ తర్వాత సూపర్ 8, ఆపై సెమీఫైనల్స్, ఫైనల్ జరుగుతాయి. 2024లో విజేతగా నిలిచిన భారత్, ఈసారి సొంత గడ్డపై టైటిల్‌ను నిలబెట్టుకోవాలని చూస్తోంది. మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది.
ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ (ఫిబ్రవరి 15) గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ జట్టు భారత్‌లో ఆడటానికి విముఖత చూపడంతో, వారి గ్రూప్ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే నిర్వహించనున్నారు.
ఈరోజు రాత్రి జరగబోయే భారత్ vs USA మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని మన జట్టు బోణీ కొడుతుందని ఆశిద్దాం!
ఏ గ్రూప్‌లో ఎవరు
గ్రూప్-ఎ: ఇండియా, పాకిస్తాన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా.
గ్రూప్-బి: శ్రీలంక, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జింబాబ్వే, ఒమన్.
గ్రూప్-సి: ఇంగ్లండ్, వెస్టిండీస్, స్కాట్లాండ్, నేపాల్, ఇటలీ.
గ్రూప్-డి: సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్, యూఏఈ, కెనడా