చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..

ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..

Update: 2026-02-04 05:03 GMT

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ త్వరలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లోకి అడుగుపెట్టబోతోందని ఆ జట్టు CEO కాశీ విశ్వనాథన్ స్వయంగా ప్రకటించారు.

మంగళవారం నాడు జరిగిన 'ఇన్వెస్ట్ ఇన్ తమిళనాడు' కాన్క్లేవ్‌లో ఆయన ఈ కీలక విషయాలను వెల్లడించారు.

సీఎస్‌కే సంస్థను మరిన్ని క్రీడలకు విస్తరించాలని యాజమాన్యం భావిస్తోంది. ఇందులో భాగంగా మహిళల క్రికెట్ ( తమ మొదటి ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడే వెంటనే కాకపోయినా, రాబోయే ఒకటి రెండు ఏళ్లలో (బహుశా 2027 సీజన్ నాటికి) డబ్ల్యూపీఎల్‌లో సీఎస్‌కే జట్టును చూసే అవకాశం ఉంది. ప్రస్తుతం WPLలో 5 జట్లు మాత్రమే ఉన్నాయి. బీసీసీఐ జట్ల సంఖ్యను పెంచేందుకు (Expansion) మొగ్గు చూపితే, కొత్త ఫ్రాంచైజీని దక్కించుకోవడానికి సీఎస్‌కే సిద్ధంగా ఉంది.

సీఎస్‌కే ఎంట్రీ ఇస్తే WPL రేంజ్ మారిపోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎందుకంటే ఐపీఎల్‌లో చెన్నైకి ఉన్న భారీ ఫ్యాన్ బేస్ ఇప్పుడు ఉమెన్స్ లీగ్‌కు కూడా తోడవుతుంది. ఎంఎస్ ధోనీ మెంటార్‌గా లేదా ఏదైనా ఇతర పాత్రలో ఉమెన్స్ టీమ్‌కు కూడా సలహాలు ఇచ్చే అవకాశం ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Tags:    

Similar News