Hyderabad Marathon: హైదరాబాద్ లో 28 వేల మందితో మారథాన్

28 వేల మందితో మారథాన్;

Update: 2025-07-29 07:51 GMT

Hyderabad Marathon: హైదరాబాద్‌లోని NMDC హైదరాబాద్ మారథాన్ తన 14వ ఎడిషన్ కోసం సిద్ధంగా ఉంది. ఆగస్టు 23, 24న జరగనున్న మారథాన్ లో 28,000 మందికి పైగా రన్నర్‌లు రికార్డు స్థాయిలో నమోదు చేసుకున్నారు. ఇది భారతదేశంలో రెండవ అతిపెద్ద మారథాన్‌గా, వరల్డ్ అథ్లెటిక్స్ లేబుల్ రేసుగా గుర్తింపు పొందింది.

ఆగస్టు 23న ఉదయం 7 గంటలకు 5K ఫన్ రన్ హైటెక్స్ గ్రౌండ్స్ (మాదాపూర్) నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 24న ఉదయం 4:30 గంటలకు పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్ నుంచి ఫుల్ మారథాన్ (42.2 కి.మీ) , హాఫ్ మారథాన్ (21.1 కి.మీ) ప్రారంభం కానుంది.

ఆగస్టు 24న ఉదయం 7 గంటలకు హైటెక్స్ గ్రౌండ్స్ గ్రౌండ్స్ (మాదాపూర్) నుంచి 10K రన్ ప్రారంభం కానుంది. అన్ని రేసులు గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద ముగుస్తాయి. ఈ సంవత్సరం మారథాన్‌కు రూ. 45 లక్షల బహుమతి లభించనుంది.

Tags:    

Similar News