Hyderabad Star Isha Singh: హైదరాబాద్ స్టార్.. ఇషా సింగ్ కు మరో సిల్వర్ మెడల్

ఇషా సింగ్ కు మరో సిల్వర్ మెడల్

Update: 2025-11-12 03:31 GMT

Hyderabad Star Isha Singh: హైదరాబాద్‌కు చెందిన స్టార్ షూటర్ ఇషా సింగ్ తాజాగా మరో రజత పతకం (Silver Medal) సాధించింది. ఈజిప్ట్ లో మంగళవారం జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ (10m Air Pistol Mixed Team) ఇషా సింగ్, యువ షూటర్ సమ్రాట్ రాణా తో కలిసి పథకం నెగ్గింది. గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో భారత ద్వయం చైనాకు చెందిన కై హు, కియాన్సున్ యావో జోడీ చేతిలో 10-16 తేడాతో ఓటమి పాలై రజతంతో సరిపెట్టుకుంది.

ఈ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు (నవంబర్ 11 నాటికి) భారతదేశం 3 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలతో మొత్తం 11 పతకాలు సాధించి చైనా తర్వాత రెండవ స్థానంలో ఉంది.

ఇషా సింగ్ గతంలో కూడా ఆసియా క్రీడలలో (Asian Games) ఒక స్వర్ణం మరియు మూడు రజతాలతో అద్భుతంగా రాణించింది.

Tags:    

Similar News