World Para Athletics Championship: వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్.. 22 మెడల్స్ తో ఇండియా రికార్డ్
22 మెడల్స్ తో ఇండియా రికార్డ్
By : PolitEnt Media
Update: 2025-10-06 05:25 GMT
World Para Athletics Championship: ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2025 లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేసి రికార్డు స్థాయిలో 22 పతకాలు సాధించింది. చివరి రోజైన అక్టోబర్ 5న ఇండియాకు మూడు రజతాలు, ఒక కాంస్యం వచ్చాయి. భారత్ మొత్తం 22 పతకాలతో ఈ టోర్నమెంట్‌ను ముగించింది. ఇది భారతదేశానికి ఒకే ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పతకాల సంఖ్య
భారత్ 6 స్వర్ణాలు , రజతం 9, కాంస్యం 7, మొత్తం 22, ఈ ఛాంపియన్‌షిప్ ఢిల్లీలో జరిగింది .పతకాల పట్టికలో భారత్ 10వ స్థానంలో నిలిచింది. బ్రెజిల్ (44 పతకాలు) అగ్రస్థానంలో నిలిచింది. న్యూ ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు ఈ టోర్నీ జరిగింది. భారత్ ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి.