Asia Cup 2025: ఆసియా కప్ లో ఇవాళ భారత్ vs ఓమన్

ఇవాళ భారత్ vs ఓమన్

Update: 2025-09-19 04:54 GMT

Asia Cup 2025: ఆసియా కప్ లో ఇవాళ భారత్, ఒమన్ మధ్య మ్యాచ్ జరగనుంది. షేక్ జాయెద్ స్టేడియంలో రాత్రి 8:00 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఫలితంపై టోర్నీలో పెద్దగా ప్రభావం ఉండదు. ఎందుకంటే, భారత్ ఇప్పటికే సూపర్-4 దశకు అర్హత సాధించింది.

మరోవైపు, ఒమన్ జట్టు ఇప్పటికే టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది. కాబట్టి ఈ మ్యాచ్ ఒక రకంగా భారత్‌కు సూపర్-4కు ముందు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లాంటిది. ఈ మ్యాచ్‌లో బుమ్రా లాంటి కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం అవుతుంది. అలాగే సోనీలివ్, ఫ్యాన్‌కోడ్ యాప్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ కూడా అందుబాటులో ఉంది.

తుది జట్లు (అంచనా):

ఇండియా: అభిషేక్ శర్మ, శుభ్‌‌‌‌‌‌‌‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివం దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్/వరుణ్ చక్రవర్తి.

ఒమన్: జతీందర్ సింగ్ (కెప్టెన్), ఆమిర్ కలీమ్, హమ్మద్ మీర్జా, వసీం అలీ, ఆర్యన్ బిష్త్, వినాయక్ శుక్లా (వికెట్ కీపర్), జితేన్ రామానంది, షా ఫైజల్, షకీల్ అహ్మద్, హస్నైన్ షా, సమయ్ శ్రీవాస్తవ. 

Tags:    

Similar News