Indian Cricketers: బ్రిటన్ రాజు చార్లెస్-3ని కలిసిన భారత క్రికెటర్లు
చార్లెస్-3ని కలిసిన భారత క్రికెటర్లు;
Indian Cricketers: బ్రిటన్ రాజు చార్లెస్ IIIని భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు కలిశాయి. లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్ట్ ముగిసిన ఒక రోజు తర్వాత, లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారత పురుషుల జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కింగ్ చార్లెస్ III ఆటగాళ్లతో మాట్లాడి, లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ గురించి చర్చించారు. ముఖ్యంగా మొహమ్మద్ సిరాజ్ అవుట్ అయిన తీరు దురదృష్టకరం అని ఆయన వ్యాఖ్యానించారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ, కింగ్ చార్లెస్ III ఆటగాళ్ల వ్యక్తిగత వివరాల గురించి కూడా ఆరా తీశారని, ముఖ్యంగా పేసర్ ఆకాష్ దీప్ సోదరి ఆరోగ్యం గురించి అడిగారని తెలిపారు. ఈ సమావేశం ఆటగాళ్లకు ఒక ప్రత్యేక అనుభూతిని ఇచ్చింది.