Indian Test team captain Shubman Gill: కెప్టెన్ గా ఈ సిరీస్ ఎన్నో విషయలు నేర్పింది

ఎన్నో విషయలు నేర్పింది;

Update: 2025-07-29 07:58 GMT

Indian Test team captain Shubman Gill:  శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో భారత టెస్ట్ జట్టు ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. అతను కెప్టెన్‌గా తన తొలి టెస్ట్ సిరీస్‌లోనే 722 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికే నాలుగు సెంచరీలు సాధించి, ఒక టెస్ట్ సిరీస్‌లో కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

ఇంగ్లాండ్ తో నాల్గో టెస్ట్ డ్రా అయిన తర్వాత గిల్ తన కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ.. భారత జట్టుకు టెస్టుల్లో సుదీర్ఘ కాలం పాటు సేవలందించాలని తాను భావించానని.. అలాంటిది జట్టుకు సారథ్యం వహించే అవకాశం దక్కడం నిజంగా గొప్ప గౌరవమని చెప్పాడు. కెప్టెన్సీ పెద్ద బాధ్యత, టీం కష్టాల్లో ఉన్నప్పుడు కెప్టెన్‌గా ఏం చేశామనేదే ముఖ్యమని అన్నాడు.

నాల్గో టెస్టులో మా బ్యాటింగ్ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉంది. గత రెండు రోజులుగా మాపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. వికెట్లు పడితే ఫలితం మారే పరిస్థితి ఉంది. మేం ప్రతీ బంతిని ఆడుతూ, ఆటను చివరి వరకు తీసుకెళ్లాలని అనుకున్నాం. జట్టు సమావేశంలో అదే మాట్లాడుకున్నాం. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్భుత బ్యాటింగ్‌తో సెంచరీలకు చేరువయ్యారు. వారి పోరాటానికి గుర్తింపుగా శతకాలు పూర్తి చేసుకోవాలని భావించాం. ఈ క్రమంలోనే ముందుగా డ్రాకు అంగీకరించలేదు. అని చెప్పాడు.

ముఖ్యంగా జడేజా, సుందర్ ఆటను ప్రత్యేకంగా అభినందించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కొన్ని తప్పిదాలు జరిగాయని, అయితే రెండో ఇన్నింగ్స్‌లో వాటిని సరిదిద్దుకున్నామని కూడా గిల్ అన్నాడు. ఒక జట్టుగా ఈ సిరీస్ తమకు ఎన్నో విషయాలను నేర్పిందని, తదుపరి మ్యాచ్ గెలిచి సిరీస్‌ను సమం చేయాలనుకుంటున్నామని గిల్ ధీమా వ్యక్తం చేశాడు.

Tags:    

Similar News