Indian women's Cricket Team: ఆస్ట్రేలియాతో ఫస్ట్ వన్డేలో ఇండియా ఓటమి..
ఫస్ట్ వన్డేలో ఇండియా ఓటమి..
Indian women's Cricket Team: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఓటమిపాలైంది. న్యూ చండీగఢ్ మహారాజా యాదవీంద్ర సింగ్ పీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ప్రతీక రావల్ (64), స్మృతి మంధాన (58), హర్లీన్ డియోల్ (54) అర్ధసెంచరీలు సాధించారు.
282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు, కేవలం 44.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకుంది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (88), బెత్ మూనీ (77 నాటౌట్), మరియు అన్నాబెల్ సదర్లాండ్ (54 నాటౌట్) అద్భుతమైన అర్ధసెంచరీలు సాధించారు.
భారత జట్టు ఫీల్డింగ్ లోపం, ముఖ్యంగా కీలకమైన క్యాచ్ లను జారవిడచడం ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో ఆస్ట్రేలియా బ్యాటర్లకు భారీ పరుగులు చేసే అవకాశం లభించింది.ఈ మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్ రెండు వారాల తర్వాత ప్రారంభం కానున్న మహిళల వన్డే ప్రపంచ కప్‌కు సన్నాహకంగా పరిగణించబడుతోంది.