IPL 2026: ఉత్కంఠ మ్యాచ్ లో సన్ రైజర్స్ పై లక్నో విక్టరీ..

సన్ రైజర్స్ పై లక్నో విక్టరీ..

Update: 2026-04-06 01:35 GMT

IPL 2026: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జాయింట్స్ విజయం సాధించింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. హైదరాబాద్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టి, ఉప్పల్ కోటలో లక్నో జెండాను పాతారు.

ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. నితీశ్ రెడ్డి 56, క్లాసెన్ 62 పరుగులతో రాణించారు. అనంతరం 157 పరుగుల టార్గెట్ బరిలో లక్నో ఓపెనర్ మార్క్ రమ్ 45 పరుగులతో రాణించారు. తర్వంత కెప్టెన్ రిషబ్ పంత్ ఒకవైపు వికెట్లు పడుతున్నా, ఏమాత్రం బెదరకుండా తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు పంత్. కేవలం 50 బంతుల్లోనే 68 పరుగులు చేసి మ్యాచ్‌ను హైదరాబాద్ చేతుల్లోంచి లాగేసుకున్నాడు. మైదానం నలుమూలలా అతను బాదిన సిక్సర్లు చూస్తుంటే.. ఉప్పల్ స్టేడియం దద్దరిల్లిపోయింది.

సన్‌రైజర్స్ బౌలర్లు మొదట్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ, పంత్ విధ్వంసం ముందు వారి వ్యూహాలేవీ ఫలించలేదు. 5 వికెట్లు కోల్పోయినా, ఒత్తిడిని దరిచేరనీయకుండా లక్నో జట్టు లక్ష్యాన్ని ఛేదించింది. హైదరాబాద్ బ్యాటర్లు నిర్దేశించిన156 లక్ష్యం మంచిదే అయినప్పటికీ లక్నో బ్యాటింగ్ పవర్‌హౌస్ ముందు అది సరిపోలేదు.మొత్తానికి హైదరాబాద్ అభిమానులకు నిరాశ మిగిలినా, క్రికెట్ ప్రేమికులకు మాత్రం ఇదొక ఫుల్ పైసా వసూల్ మ్యాచ్. ఈ అద్భుత విజయంతో లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది.

Tags:    

Similar News