Joe Root: భారత్ పై జోరూట్ అరుదైన రికార్డ్..

జోరూట్ అరుదైన రికార్డ్..;

Update: 2025-07-11 09:52 GMT

Joe Root: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ అరుదైన రికార్డు సృష్టించారు. టెస్టుల్లో భారత్‌పై 3 వేల రన్స్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచారు.33 మ్యాచ్‌ల్లో 10 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు చేశారు. ఆ తర్వాత రికీ పాంటింగ్ 2555, కుక్ 2431, స్టీవ్ స్మిత్ 2356*, క్లైవ్ లాయిడ్ 2344 రన్స్‌ చేశారు. ఈ టెస్టులో 99 పరుగుల స్కోర్‌ వద్ద రూట్‌ ఇంగ్లండ్‌లో 7000 టెస్ట్‌ పరుగులు పూర్తి చేసుకున్నాడు.

ఇటీవల (జులై 2025) టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నెంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి రూట్ 99 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు భారత్‌పై అన్ని ఫార్మాట్లలో కలిపి 4000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. భారత్‌పై అతడు మరో సెంచరీ సాధిస్తే, స్టీవ్ స్మిత్ రికార్డును (భారత్‌పై అత్యధిక టెస్ట్ సెంచరీలు - 11) సమం చేస్తాడు.

జో రూట్ 2017 ఫిబ్రవరి నుంచి 2022 ఏప్రిల్ వరకు ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇంగ్లండ్ కెప్టెన్‌గా అత్యధిక టెస్టు మ్యాచ్‌లు (64), విజయాలు (27), ఓటముల (26) రికార్డులు అతని పేరిట ఉన్నాయి.

Tags:    

Similar News