South Africa Grand Victory: చెలరేగిన కేశవ్.. తొలి వన్డేలో ఆసిస్ పై సౌతాఫ్రికా గ్రాండ్ విక్టరీ
తొలి వన్డేలో ఆసిస్ పై సౌతాఫ్రికా గ్రాండ్ విక్టరీ;
South Africa Grand Victory: దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో తొలి వన్డేలో ఆతిథ్య జట్టుపై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది.దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా 98 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తరపున కేశవ్ మహారాజ్ కెరీర్ బెస్ట్ ప్రదర్శన కనబరిచి 5 వికెట్లు పడగొట్టాడు.
దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది.ఎయిడెన్ మార్క్‌రమ్ (82), టెంబా బావుమా (65), మాథ్యూ బ్రీట్జ్‌కే (57) అర్ధ సెంచరీలతో రాణించారు.
లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా జట్టు 40.5 ఓవర్లలో 198 రన్స్‌కే కుప్పకూలి చిత్తుగా ఓడింది
ఈ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియా తరపున అత్యధికంగా 4 వికెట్లు తీసినప్పటికీ, కేశవ్ మహారాజ్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో విజయం దక్షిణాఫ్రికా వైపు మొగ్గింది.ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలో ఉంది .కేశవ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శుక్రవారం మకేలో జరుగుతుంది.