Kuldeep Yadav: నీళ్లు ఇవ్వడానికే అతన్ని ఇంగ్లాండ్‌కు తీసుకువెళ్లారా?

అతన్ని ఇంగ్లాండ్‌కు తీసుకువెళ్లారా?;

Update: 2025-07-10 10:46 GMT

Kuldeep Yadav: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌లు ముగిశాయి. తొలి టెస్ట్‌లో భారత్ ఓడిపోగా, రెండో టెస్ట్‌లో ఇంగ్లాండ్ ఓడిపోయింది. దీంతో ప్రస్తుతం సిరీస్ సమమైంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో అద్భుతంగా ఆడే జట్టుకే సిరీస్ గెలిచే అవకాశం ఉంది. టెస్ట్ కెప్టెన్‌గా గిల్‌కు ఇది తొలి సిరీస్ అయినప్పటికీ, అతను అద్భుతంగా ప్రదర్శన ఇస్తున్నాడు. మూడో టెస్ట్ మ్యాచ్ ఇవాళ్టి నుంచి జూలై 10 నుండి లార్డ్స్ లో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సిరీస్ గెలవడంలో పెద్ద ఆధిక్యం ఉంటుంది. దీంతో ఇరు జట్లు లార్డ్స్ టెస్ట్ లో గెలవాలని పట్టుదలతో ఉన్నాయి. అయితే, ఈ సిరీస్‌లో టీమ్ ఇండియాలోని ఒక ఆటగాడికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. అతని అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ, ప్రతికూల పరిస్థితుల కారణంగా అతను బెంచ్‌కు పరిమితం అవుతున్నాడు. రెండవ టెస్ట్‌లో అతన్ని ఆడించాలనే డిమాండ్ ఉన్నప్పటికీ, టీమ్ ఇండియా యాజమాన్యం అతన్ని బెంచ్‌కు పరిమితం చేసింది. కుల్దీప్ యాదవ్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మిగిలిన మూడు మ్యాచ్ లలో అతను ఆడతాడా లేదా అనేది సందేహమే. జడేజా, వాషింగ్టన్ సుందర్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లు ఉండటంతో టీం ఇండియా యాజమాన్యం కుల్దీప్ యాదవ్ ను పట్టించుకోవట్లేదు. ఇంగ్లాండ్ పర్యటనకు నీళ్లు తీసుకురావడానికే అతన్ని ఎంపిక చేశారని అభిమానులు భావిస్తున్నారు. విదేశాల్లో భారత్ టెస్ట్ సిరీస్‌లు ఆడుతున్నప్పుడు, కుల్దీప్ యాదవ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం చాలా అరుదుగా లభిస్తుంది. కుల్దీప్ తన స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మరియు ఇంగ్లాండ్‌లతో ఆడిన మ్యాచ్‌ల సంఖ్యను వేళ్లపై లెక్కించవచ్చు. మొదటి రెండు టెస్టుల్లో కుల్దీప్ యాదవ్ వాటర్ బాటిల్ తీసుకుని కనిపించాడు. మిగిలిన మూడు మ్యాచ్‌లలో కూడా అతను ఇలాగే ఆడి, ఆ తర్వాత ఇంటికి వెళ్తాడని చెబుతున్నారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప, ఈ సిరీస్‌లో కుల్దీప్ యాదవ్ ఆడటం సందేహమే.

Tags:    

Similar News