Neeraj Chopra: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు నీరజ్ చోప్రా
చాంపియన్‌షిప్ ఫైనల్‌కు నీరజ్ చోప్రా
Neeraj Chopra: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా సత్తా చాటాడు. పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో పోటీపడిన డిఫెండింగ్ ఛాంపియన్ నీరజ్, తన తొలి ప్రయత్నంలోనే 84.85 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌కు అర్హత సాధించాడు. అర్హత మార్కు (84.50మీ)ను సునాయాసంగా దాటడం ద్వారా తన ఫామ్‌ను మరోసారి నిరూపించుకున్నాడు.
గ్రూప్-ఏలో జర్మనీకి చెందిన జులియన్ వెబర్, కెషెర్న్ వాల్కట్, జాకబ్ వాల్దిచ్ వంటి దిగ్గజాలతో పోటీపడిన నీరజ్, అంచనాలకు తగ్గట్టుగా అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్న నీరజ్, టోక్యోలో తన టైటిల్‌ను నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉన్నాడు.
చరిత్ర సృష్టించేందుకు నీరజ్ సిద్ధం
గురువారం జరిగే ఫైనల్‌లో పసిడి పతకం సాధిస్తే, నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించనున్నాడు. రెండు సార్లు ప్రపంచ టైటిల్ సాధించిన దిగ్గజ అథ్లెట్లు జాన్ జెల్నెజీ (1993, 1995), పీటర్స్ (2019, 2022) సరసన నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ పోటీలో నీరజ్ చిరకాల ప్రత్యర్థి, పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ కూడా పాల్గొంటున్నాడు. పారిస్ ఒలింపిక్స్ తర్వాత వీరిద్దరూ పోటీపడటం ఇదే మొదటిసారి.