Neeraj Chopra: నిరాశ పరిచిన నీరజ్..8 వ ప్లేస్ తో సరి
8 వ ప్లేస్ తో సరి
Neeraj Chopra: వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2025లో భారత స్టార్ అథ్లెట్, ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా నిరాశపరిచాడు. టోక్యోలో జరిగిన పురుషుల 84.03 మీటర్ల జావెలిన్ త్రో ఫైనల్‌లో అతను ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇది అతని అభిమానులకు షాక్‌కు గురిచేసింది.
ఇది అతని కెరీర్‌లో చాలా అరుదైన ఓటమి. 2021లో టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించినప్పటి నుంచి అతను ఏ అంతర్జాతీయ ఈవెంట్‌లోనూ టాప్-2లో స్థానం కోల్పోలేదు.ఈ ఛాంపియన్‌షిప్‌కు ముందు నీరజ్ చోప్రాకు వెన్నునొప్పి సమస్య ఉందని, ఇది అతని ప్రదర్శనపై ప్రభావం చూపిందని తెలుస్తోంది.
నీరజ్ చోప్రా తో పాటు ఫైనల్లో పాల్గొన్న మరో భారత అథ్లెట్ సచిన్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతను తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో 86.27 మీటర్లు విసిరి నాలుగో స్థానంలో నిలిచి అందరినీ ఆకట్టుకున్నాడు.ఈ పోటీలో ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన కేశోర్న్ వాల్‌కాట్ 88.16 మీటర్ల త్రోతో గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. గతంలో నీరజ్ ప్రధాన ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.ఈ ఫలితం నీరజ్ చోప్రాకు ఒక తాత్కాలిక ఎదురుదెబ్బ మాత్రమే, కానీ అతని కెరీర్‌లో ఒక అరుదైన అనూహ్యమైన ఓటమిగా మిగిలిపోయింది.