Rohit Sharma: ఫిట్‌నెస్ పరీక్షలో నెగ్గిన వన్డే కెప్టెన్ రోహిత్
వన్డే కెప్టెన్ రోహిత్
Rohit Sharma: భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షలో విజయం సాధించారు. ఈ పరీక్షలో యో-యో టెస్ట్‌తో పాటు కొత్తగా ప్రవేశపెట్టిన బ్రోంకో టెస్ట్‌ను కూడా ఆయన పూర్తి చేశారని సమాచారం. ఈ ఫిట్‌నెస్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేయడంతో, రాబోయే ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ అందుబాటులో ఉంటారని తెలుస్తోంది. రోహిత్‌తో పాటు, టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, జస్‌ప్రీత్ బుమ్రా వంటి పలువురు ఇతర ఆటగాళ్లు కూడా ఈ ఫిట్‌నెస్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ నెల 9న ఆరంభమయ్యే టీ20 ఆసియాకప్ కోసం గిల్ త్వరలోనే దుబాయ్ బయలుదేరనున్నాడు. అతడి సహచరులు బుమ్రా, జితేశ్ శర్మ కూడా ఫిట్‌నెస్ పరీక్షలో నెగ్గారు. జ్వరం కారణంగా దులీప్ ట్రోఫీ నుంచి వైదొలగడంతో గిల్‌కు పరీక్ష తప్పనిసరైంది. సిరాజ్, యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ కూడా ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నట్లు తెలుస్తోంది. వీళ్లలో జైస్వాల్, సుందర్ ఆసియాకప్‌నకు స్టాండ్‌బైలుగా ఉన్నారు.