Royal Challengers Bengaluru: ఒకప్పుడు ఐపీఎల్ క్రికెటర్..ఇపుడు ఆర్సీబీకి ఛైర్మన్

ఇపుడు ఆర్సీబీకి ఛైర్మన్

Update: 2026-03-25 07:28 GMT

Royal Challengers Bengaluru: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB). ఈ పేరు వింటేనే ఒక వైబ్రేషన్! కోట్ల మంది అభిమానుల గుండె చప్పుడు. ఇప్పుడు ఈ జట్టు ప్రయాణంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా గ్రూప్ అధినేత కుమార మంగళం బిర్లా కుమారుడు ఆర్యమాన్ విక్రమ్ బిర్లా RCB కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 16 వేల కోట్ల మెగా డీల్ తర్వాత, ఇప్పుడు యువ రక్తం జట్టు పగ్గాలు చేపట్టడం సంచలనంగా మారింది.

ఆర్యమాన్ బిర్లా గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆయన కేవలం ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదు, స్వతహాగా ఒక క్రికెటర్. మధ్యప్రదేశ్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన అనుభవం ఆయనకు ఉంది. గతంలో ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నారు. క్రికెట్ మీద ఉన్న మక్కువ, గ్రౌండ్‌లో ఉన్న అనుభవం.. ఇప్పుడు RCBని నడిపించడంలో ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్‌ కాబోతున్నాయి.

ఒక పక్క బిర్లా గ్రూప్ ఆర్థిక బలం, మరోపక్క ఆర్యమాన్ బిర్లా క్రీడా పరిజ్ఞానం.. ఈ రెండూ కలిస్తే RCB భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆర్యమాన్ రాకతో వేలం వ్యూహాలు, జట్టు మేనేజ్‌మెంట్ ఏ విధంగా మారబోతున్నాయి అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. విరాట్ కోహ్లీ వంటి లెజెండరీ ప్లేయర్ ఉన్న జట్టుకు, ఆర్యమాన్ వంటి యువ ఛైర్మన్ తోడవ్వడం ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News