Pacer Yash Dayal: ఆర్సీబీ బౌలర్ పై రేప్ కేసు..నేరం రుజువైతే 10ఏళ్ల జైలు
నేరం రుజువైతే 10ఏళ్ల జైలు;
Pacer Yash Dayal: పేసర్ యష్ దయాల్‌పై ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇందిరాపురం పీఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అతనిపై ఘజియాబాద్ యువతి లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమె సీఎం గ్రీవెన్స్ పోర్టల్‌లో అతనిపై ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 69 ప్రకారం దయాల్‌పై కేసు నమోదు చేశారు. పెళ్లి, ఉద్యోగం వంటి తప్పుడు వాగ్దానాలతో మోసం చేసిన ఘటనల్లో ఈ సెక్షన్ వాడతారు. నేరం రుజువైతే అతనికి పదేళ్ల వరకు శిక్ష పడుతుంది.
యష్ దయాల్ దేశీయ క్రికెట్‌లో ఉత్తరప్రదేశ్‌కు, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయన ఎడమచేతి ఫాస్ట్-మీడియం బౌలర్.యష్ దయాల్ 2024 వేలంలో అతన్ని ఆర్సీబీ 5 కోట్లకు పైగా బిడ్ తో ఎంపిక చేసింది. ఆ సీజన్ లో అతను అద్భుతమైన ఎంట్రీ ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పై 13 మ్యాచ్ లలో 15 వికెట్లు పడగొట్టాడు. 3/20 అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు సాధించాడు.