Rinku Singh: టీమిండియా రింకు సింగ్ తండ్రి కన్నుమూత
రింకు సింగ్ తండ్రి కన్నుమూత
Rinku Singh: టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి ఖంచంద్ సింగ్ ఈరోజు (ఫిబ్రవరి 27, 2026) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా లివర్ క్యాన్సర్ (Stage 4) తో పోరాడుతూ గ్రేటర్ నోయిడాలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఖంచంద్ సింగ్ పరిస్థితి గత కొన్ని రోజులుగా విషమంగా ఉండటంతో ఆయనను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ ఆడుతున్న రింకూ సింగ్, తన తండ్రి ఆరోగ్యం క్షీణించిందని తెలిసి కొన్ని రోజుల క్రితమే జట్టును వీడి ఇంటికి వెళ్లారు. మళ్ళీ జింబాబ్వే మ్యాచ్ సమయానికి జట్టుతో చేరినప్పటికీ, తండ్రి మరణవార్త విన్న వెంటనే తిరిగి స్వస్థలం అలీగఢ్‌కు బయలుదేరారు.మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, రింకూ సింగ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
రింకూ సింగ్ తండ్రి ఒకప్పుడు గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేసే పని చేస్తూ ఎన్నో కష్టాల మధ్య రింకూను క్రికెటర్ గా తీర్చిదిద్దారు. తన ఎదుగుదలలో తండ్రి పాత్ర ఎంతో ఉందని రింకూ తరచుగా చెబుతుంటారు.ఈ కష్ట సమయంలో రింకూ సింగ్ మళ్ళీ ఎప్పుడు జట్టుతో చేరుతారనేది ఇంకా స్పష్టత లేదు.