Rishabh Pant vs Sanjiv Goenka: గ్రౌండ్‌లో పంత్ వర్సెస్ గోయెంకా: మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యిందా?

మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యిందా?

Update: 2026-04-03 02:54 GMT

Rishabh Pant vs Sanjiv Goenka: ఐపీఎల్ మైదానంలో మరోసారి హైడ్రామా చోటుచేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోయిన తర్వాత, ఆ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా మరియు కెప్టెన్ రిషబ్ పంత్ మధ్య జరిగిన ఒక సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. మ్యాచ్ ముగిశాక గోయెంకా మైదానంలోకి వచ్చి పంత్, కోచ్ జస్టిన్ లాంగర్‌లతో మాట్లాడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఆడియో వినిపించకపోయినా, వారి ముఖ కవళికలను బట్టి చూస్తే అక్కడ ఏదో సీరియస్ చర్చ జరుగుతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా సంజీవ్ గోయెంకా కోపంగా ఏదో చెబుతుండగా, పంత్ అంతే దీటుగా సమాధానం ఇస్తున్నట్లు ఆ దృశ్యాల్లో కనిపిస్తోంది. ఇది చూసిన క్రికెట్ అభిమానులకు 2024 సీజన్ గుర్తుకొస్తోంది. అప్పట్లో అప్పటి కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను కూడా గోయెంకా అందరి ముందే బహిరంగంగా మందలించడం పెద్ద దుమారం రేపింది. ఇప్పుడు పంత్ విషయంలోనూ అదే రిపీట్ అయిందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ నెటిజన్లు గోయెంకాపై విమర్శలు గుప్పిస్తున్నారు.

సోషల్ మీడియాలో ఈ చర్చ ముదరడంతో సంజీవ్ గోయెంకా స్వయంగా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా వివరణ ఇచ్చారు. "ఇది చాలా సుదీర్ఘమైన సీజన్. ఒక బలమైన జట్టును నిర్మించే క్రమంలో ఇలాంటి గంభీరమైన చర్చలు సహజమే. మా కెప్టెన్, మా జట్టు మళ్లీ పుంజుకుంటారనే నమ్మకం నాకుంది. లక్నో జట్టు ప్రస్థానం ఇప్పుడే మొదలైంది" అంటూ గొడవ వార్తలను సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ, మైదానంలో జరిగిన ఆ 'వాడివేడి' చర్చ మాత్రం నెట్టింట వైరల్ అవుతూనే ఉంది.

Tags:    

Similar News