T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ లో శ్రీలంకకు ఎదురుదెబ్బ

శ్రీలంకకు ఎదురుదెబ్బ

Update: 2026-02-19 04:54 GMT

T20 World Cup 2026: శ్రీలంక స్టార్ పేసర్ మతీశ పతిరణ గాయం కారణంగాటీ20 ప్రపంచకప్ టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. సూపర్-8 దశకు ముందు శ్రీలంక జట్టుకు ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బ.ఫిబ్రవరి 16న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో తన మొదటి ఓవర్ వేస్తుండగా పతిరణ గాయపడ్డారు. కేవలం నాలుగు బంతులు వేసిన తర్వాత ఎడమ కాలి కండరాల నొప్పితో మైదానాన్ని వీడారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు ఆయన అందుబాటులో ఉండరని ఐసీసీ (ICC) టెక్నికల్ కమిటీ ధృవీకరించింది.

పతిరణ స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ దిల్షాన్ మధుశంకను శ్రీలంక జట్టులోకి తీసుకున్నారు. ఐసీసీ దీనికి అధికారికంగా ఆమోదం తెలిపింది.శ్రీలంక జట్టు ఇప్పటికే ఇద్దరు కీలక ఆటగాళ్లను కోల్పోయింది.మతీశ పతిరణ డెత్ ఓవర్లలో అత్యంత కీలకమైన బౌలర్.

వనిందు హసరంగ ఇప్పటికే గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యారు.

సూపర్ 8 లో శ్రీలంక తన తదుపరి మ్యాచ్‌లు ఫిబ్రవరి 19న గ్రూప్ దశ చివరి మ్యాచ్ (జింబాబ్వేతో). ఫిబ్రవరి 22న సూపర్-8 మొదటి మ్యాచ్ (ఇంగ్లాండ్‌తో)ఆడనుంది. పతిరణ గాయం గురించి తెలుసుకున్న ఐపీఎల్ ఫ్యాన్స్, ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా సమయం ఉండటంతో అప్పటికి ఆయన కోలుకునే అవకాశం ఉందని సమాచారం.

Tags:    

Similar News