Varun Chakravarthy: కోహ్లీ, రోహిత్ లకు దక్కని చోటు... వరుణ్ చక్రవర్తి డ్రీమ్ టీ20 ఎలెవన్ టీమ్ ఇదే!
వరుణ్ చక్రవర్తి డ్రీమ్ టీ20 ఎలెవన్ టీమ్ ఇదే!;
Varun Chakravarthy: టీం ఇండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన కలల టీ20 ఎలెవన్‌ను ప్రకటించాడు. అయితే ఇందులో భారత దిగ్గజ టీ20 స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు మాత్రం చోటుదక్కలేదు. 2021లో శ్రీలంకతో జరిగిన T20I ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వరుణ్ చక్రవర్తి ఈ సంవత్సరం తన వన్డే అరంగేట్రం కూడా చేశాడు. భారత్త ICC ఛాంపియన్స్ ట్రోఫీ-2025ను గెలుచుకోవడంలో అతను కీలక పాత్రను పోషించాడు. కుడిచేతి లెగ్ బ్రేక్ స్పిన్నర్ ఇప్పటివరకు టీమ్ ఇండియా తరపున 18 T20లు , నాలుగు ODIలు ఆడి వరుసగా 33, 10 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం విరామంలో ఉన్న వరుణ్ చక్రవర్తి మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అశ్విన్ తన కలల T20 XI పేరు చెప్పమని వరుణ్ ను అడిగాడు. ఈ క్రమంలో వరుణ్ తన జట్టును ప్రకటించాడు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలను పక్కనపెట్టి.. బట్లర్, హెడ్‌లను ఓపెనర్లుగా ఎంపిక చేసుకున్నాడు. తన కలల జట్టులో బ్యాట్స్‌మన్‌గా టీం ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను కూడా ఎంపిక చేసుకున్నాడు.
వరుణ్ చక్రవర్తి డ్రీమ్ టీ20 ఎలెవన్: జోస్ బట్లర్ (ఇంగ్లండ్), ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా), సూర్యకుమార్ యాదవ్ (భారత్), నికోలస్ పూరన్ (వెస్టిండీస్), హెన్రిక్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా), హార్దిక్ రాజ్‌నాథ్ సింగ్ (రష్యా), ఆంధ్రప్రదేశ్ (భారత్) ఖండీస్ (రష్యా), (ఆఫ్ఘనిస్థాన్), జస్ప్రీత్ బుమ్రా (భారతదేశం), మతిషా పతిరానా (శ్రీలంక).