T20 World Cup 2026: బ్రూక్ రికార్డ్ సెంచరీతో ఇంగ్లాండ్ విక్టరీ..పాక్ సెమీస్ ఆశలు గల్లంతు.!
పాక్ సెమీస్ ఆశలు గల్లంతు.!
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ సూపర్-8 లో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఇంగ్లాండ్ 2 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై విజయం సాధించింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ సెమీఫైనల్‌కు చేరుకున్న మొదటి జట్టుగా నిలిచింది.
ముందుగా పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. సాహిబ్‌జాదా ఫర్హాన్ (63 పరుగులు) ఒంటరి పోరాటం చేయగా, బాబర్ ఆజం (25), ఫఖర్ జమాన్ (25) ఫర్వాలేదనిపించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో లియామ్ డాసన్ 3 వికెట్లతో అద్భుతంగా రాణించాడు.
టార్గెట్ బరిలో ఇంగ్లాండ్ 19.1 ఓవర్లలో 166 పరుగులు చేసి విజయం సాధించింది. హ్యారీ బ్రూక్ కేవలం 51 బంతుల్లోనే 100 పరుగులు (10 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి జట్టును గెలిపించాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో సెంచరీ సాధించిన మొదటి కెప్టెన్‌గా బ్రూక్ రికార్డు సృష్టించాడు. చివరిలో జోఫ్రా ఆర్చర్ విన్నింగ్ బౌండరీ కొట్టి విజయాన్ని ఖరారు చేశాడు.పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ షా అఫ్రిది 4 వికెట్లు తీసినప్పటికీ పాకిస్తాన్‌ను ఓటమి నుండి కాపాడలేకపోయాడు.
పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్ 4 పాయింట్లతో సెమీస్ కు అర్హత సాధించగా.. పాకిస్తాన్ ఒక పాయింట్ తో కష్టాల్లో ఉంది. పాకిస్తాన్ మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో వారికి ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు సెమీస్ చేరాలంటే తమ తదుపరి మ్యాచ్‌లో శ్రీలంకపై తప్పక గెలవాలి, అలాగే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.