T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామన్న నిర్ణయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా వెనక్కి తీసుకుంది. బంగ్లాదేశ్ జట్టుకు మద్దతుగా భారత్‌తో మ్యాచ్ ఆడబోమని గత వారం పాకిస్తాన్ ప్రకటించింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC), శ్రీలంక క్రికెట్ బోర్డు, ఇతర సభ్య దేశాల నుంచి వచ్చిన విన్నపాలు, చర్చల తర్వాత ఈ నిర్ణయాన్ని మార్చుకుంది.

క్రికెట్ స్ఫూర్తిని కాపాడటానికి, అలాగే 'మిత్ర దేశాల' కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్తాన్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. టోర్నీ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్‌‌పై ఎటువంటి జరిమానా విధించకూడదని ఐసీసీ అంగీకరించడం, పాకిస్తాన్ శాంతించడానికి ప్రధాన కారణమైంది. పీసీబీతో చర్చలు విజయవంతమయ్యాయని, సభ్య దేశాలన్నీ తమ నిబద్ధతను గౌరవించి వరల్డ్ కప్‌‌ను సక్సెస్ చేయాలని ఐసీసీ కోరింది. భారత్ , పాకిస్తాన్ మధ్య ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ ఫిబ్రవరి 15న శ్రీలంకలోని కొలంబోలో (ప్రేమదాస స్టేడియం) జరగనుంది.

ఒకవేళ పాక్ ఆడకపోతే ఐసీసీ నుంచి భారీ జరిమానా (సుమారు $38 మిలియన్లు) ఇతర ఆంక్షలు ఎదుర్కోవాల్సి వచ్చేది. పాకిస్తాన్ జట్టు ఇప్పటికే టోర్నీలో తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. నెదర్లాండ్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో గెలిచింది. ఈరోజు అమెరికాతో రెండో మ్యాచ్ ఆడాల్సి ఉంది.

Tags: