T20 World Cup: టీ20 వరల్డ్ కప్ : అభిషేక్ శర్మను పక్కన పెడతారా?
అభిషేక్ శర్మను పక్కన పెడతారా?
T20 World Cup: టీమిండియా యంగ్ క్రికెటర్ అభిషేక్ శర్మ ఐపీఎల్‌లో అదరగొట్టిన ఫామ్‌ను చూసి, అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యంగా ఈ వరల్డ్ కప్‌లో అతను టీమ్ ఇండియాకు 'ఎక్స్-ఫ్యాక్టర్' అవుతాడని అందరూ ఆశించారు. కానీ ప్రస్తుతం అతని ఆటతీరు ఆందోళన కలిగిస్తోంది. ఈ మ్యాచులో తప్పకుండా ఆడతాడు అని అనుకోవడం తప్ప అభి బ్యాట్ నుంచి పరుగుల ప్రవాహమే లేదు. ఇప్పటివరకు 6 మ్యాచుల్లో 80 రన్స్ మాత్రమే చేశారు. 3సార్లు డకౌట్ అయ్యారు. సూపర్-8లో జింబాబ్వేపై 55రన్స్ చేసి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడనుకునేలోపే నిన్న విండీస్‌పై 10పరుగులకే వెనుదిరిగారు.
అభిషేక్ సహజంగానే అగ్రెసివ్ ప్లేయర్. అయితే, అంతర్జాతీయ బౌలర్లు అతని బలహీనతలను పసిగట్టారు. క్రీజులోకి వచ్చిన వెంటనే భారీ షాట్లకు ప్రయత్నించి వికెట్ పారేసుకోవడం అతనికి అలవాటుగా మారింది.కేవలం బ్యాటింగ్‌లోనే కాదు, ఫీల్డింగ్‌లో కూడా అతను భారీ తప్పిదాలు చేస్తున్నాడు. వెస్ట్ ఇండీస్‌తో మ్యాచ్‌లో అతను వదిలేసిన రెండు క్యాచ్‌లు మ్యాచ్ ఫలితాన్నే మార్చేశాయి. ఒక యంగ్ ప్లేయర్ నుండి జట్టు ఆశించే కనీస చురుకుదనం అతనిలో లోపించినట్లు కనిపిస్తోంది.
ఒక ఇన్నింగ్స్‌లో మెరుపులు మెరిపించినా, వరుసగా విఫలం కావడం వల్ల జట్టుపై ఒత్తిడి పెరుగుతోంది. సెమీ ఫైనల్స్ సమీపిస్తున్న తరుణంలో, మేనేజ్‌మెంట్ అభిషేక్ శర్మకు మరో అవకాశం ఇస్తుందా? లేక అతని స్థానంలో యశస్వి జైస్వాల్‌ని తుది జట్టులోకి తీసుకుంటుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.