ODI World Cup: వన్డే వరల్డ్ కప్ కు ఎంపికైన తెలుగమ్మాయిలు
తెలుగమ్మాయిలు;
ODI World Cup: హైదరాబాద్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ అరుంధతి రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీ చరణికి 2025లో స్వదేశంలో జరగబోయే ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. అరుంధతి రెడ్డి గతంలో 2018 ,2020లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఇటీవల ఆమె జాతీయ జట్టులోకి తిరిగి వచ్చింది. అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది.
అరుంధతి గతంలో రైల్వేస్ తరపున ఆడింది, ఆ తర్వాత తన క్రికెట్ కెరీర్‌పై మరింత దృష్టి పెట్టడానికి రైల్వేస్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆమె దేశవాళీ క్రికెట్‌లో , ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతూ నిలకడగా రాణిస్తోంది.భారత జట్టు తన ప్రపంచకప్ ప్రచారాన్ని సెప్టెంబర్ 30న శ్రీలంకతో ప్రారంభించనుంది.
శ్రీ చరణి
కడప జిల్లాకు చెందిన 20 ఏళ్ల శ్రీ చరణి దేశవాళీ క్రికెట్, అలాగే మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఈ ప్రదర్శనల ఫలితంగా ఆమెకు భారత జట్టులోకి ఎంపికయ్యే అవకాశం వచ్చింది. ఆమె తన అంతర్జాతీయ వన్డే , టీ20 అరంగేట్రాల్లోనూ మంచి ప్రదర్శన చేసి సెలెక్టర్ల నమ్మకాన్ని మరింత పెంచుకుంది. ఈ ఇద్దరు తెలుగు క్రికెటర్లు ప్రపంచకప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు.