Under-19 World Cup 2026: ఫైనల్ కు చేరేది ఎవరు.? ఇవాళ ఆఫ్గనిస్తాన్ తో ఇండియా సెమీస్ ఫైట్
ఇవాళ ఆఫ్గనిస్తాన్ తో ఇండియా సెమీస్ ఫైట్
Under-19 World Cup 2026: ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 4) రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ కీలక పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, పటిష్టమైన ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతోంది.
హరారే స్పోర్ట్స్ క్లబ్, జింబాబ్వేలో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:00 గంటలకు ప్రారంభమవుతుంది.
ఆయుష్ మ్హాత్రే నాయకత్వంలోని భారత జట్టు ఈ టోర్నీలో ఇప్పటివరకు ఓటమి అనేది లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ముఖ్యంగా గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించి మంచి ఊపులో ఉన్నారు. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ, బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు మరియు బౌలర్ హెనిల్ పటేల్ ఫామ్‌లో ఉన్నారు.
ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో గెలిచిన అఫ్గాస్తాన్ సంచలనంపై కన్నేసిందిసౌత్ ఆఫ్రికా, వెస్ట్ ఇండీస్ వంటి జట్లను ఓడించి సెమీస్ చేరిన ఆ జట్టును తక్కువ అంచనా వేయలేం. వారి స్పిన్ బౌలింగ్ భారత్‌కు సవాలుగా మారవచ్చు.ఇప్పటికే నిన్న జరిగిన మొదటి సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లాండ్ ఫైనల్‌కు చేరుకుంది. ఇవాళ భారత్ గెలిస్తే, ఫిబ్రవరి 6న జరిగే గ్రాండ్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో తలపడుతుంది.