Under-19 World Cup 2026: అండర్‌‌‌‌–19 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ సెమీస్‌‌‌‌కు ఇండియా

సెమీస్‌‌‌‌కు ఇండియా

Update: 2026-02-02 05:29 GMT

Under-19 World Cup 2026: అండర్‌‌‌‌–19 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో ఇండియా కుర్రాళ్లు మరోసారి మెరిశారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌‌ను చిత్తు చేస్తూ అజేయంగా సెమీఫైనల్​కు దూసుకెళ్లారు. వేదాంత్‌‌‌‌ త్రివేది (68), కనిష్క్‌‌‌‌ చౌహాన్‌‌‌‌ (35), వైభవ్‌‌‌‌ సూర్యవంశీ (30)కు తోడు బౌలింగ్‌‌‌‌లో ఖిలాన్‌‌‌‌ పటేల్‌‌‌‌ (3/35), ఆయుష్‌‌‌‌ మాత్రే (3/21) చెలరేగడంతో.. ఆదివారం జరిగిన సూపర్‌‌‌‌–6 చివరి మ్యాచ్‌‌‌‌లో ఇండియా 58 రన్స్‌‌‌‌ తేడాతో పాకిస్తాన్‌‌‌‌పై గెలిచింది.

టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఇండియా 49.5 ఓవర్లలో 252 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. ఓపెనింగ్‌‌‌‌లో సూర్యవంశీ ఓ మాదిరిగా ఆడినా.. ఆరోన్‌‌‌‌ జార్జ్‌‌‌‌ (16), ఆయుష్‌‌‌‌ మాత్రే (0) విఫలం కావడంతో ఇండియా 47/3తో కష్టాల్లో పడింది.ఈ దశలో వేదాంత్‌‌‌‌ కీలక ఇన్నింగ్స్‌‌‌‌ ఆడాడు. విహాన్‌‌‌‌ మల్హోత్రా (21), అభిగ్యాన్‌‌‌‌ కుండు (16), అంబరీష్‌‌‌‌ (29), ఖిలాన్‌‌‌‌ పటేల్‌‌‌‌ (21) కూడా బ్యాట్లు అడ్డేయడంతో ఇండియా మంచి టార్గెట్‌‌‌‌ను నిర్దేశించింది. అబ్దుల్‌‌‌‌ సుభాన్‌‌‌‌ 3, మహ్మద్‌‌‌‌ సైమ్‌‌‌‌ 2 వికెట్లు తీశారు. తర్వాత పాకిస్తాన్‌‌‌‌ 46.2 ఓవర్లలో 194 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. ఉస్మాన్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (66) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. హమ్జా జహూర్‌‌‌‌ (42), ఫర్హాన్‌‌‌‌ యూసఫ్‌‌‌‌ (38), హుజాఫియా హసన్‌‌‌‌ (14) పోరాడి విఫలమయ్యారు. ఇండియా బౌలింగ్‌‌‌‌ ధాటికి పాక్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌లో ఏడుగురు సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌కే పరిమితమయ్యారు. అంబరీష్‌‌‌‌, హెనిల్‌‌‌‌ పటేల్‌‌‌‌, కనిష్క్‌‌‌‌ చౌహాన్‌‌‌‌, విహాన్‌‌‌‌ తలా ఓ వికెట్‌‌‌‌ పడగొట్టారు. కనిష్క్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. బుధవారం జరిగే సెమీస్‌‌‌‌లో ఇండియా.. అఫ్గానిస్తాన్‌‌‌‌తో తలపడుతుంది.

Tags:    

Similar News