Cricket: క్రికెట్ అంటేనే మహిళలకు ఎక్కువ ఇంట్రెస్ట్...సర్వేలో ఆసక్తికర విషయాలు

సర్వేలో ఆసక్తికర విషయాలు

Update: 2026-03-14 07:48 GMT

Cricket: బీబీసీ (BBC), కలెక్టివ్ న్యూస్‌ రూమ్ సంయుక్తంగా నిర్వహించిన తాజా సర్వేలో భారత మహిళల క్రికెట్‌కు సంబంధించి ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. అమ్మాయిలకు ఆటలపై ఆసక్తి పెరిగినట్లు తేలింది. 14 రాష్ట్రాల్లో దాదాపు 10,000 మందిపై నిర్వహించిన ఈ సర్వేలో కీలక విషయాలు తెలిశాయి.

2020లో కేవలం 5% ఉన్న మహిళల క్రికెట్ భాగస్వామ్యం, ప్రస్తుతం 10% కి పెరిగింది. అంటే సరిగ్గా డబుల్ అయ్యింది. 15 నుండి 24 ఏళ్ల మధ్య వయస్సున్న యువతుల్లో ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తోంది. వీరిలో క్రికెట్ ఆడేవారి సంఖ్య 6% నుండి 16% కి చేరుకుంది. సర్వేలో పాల్గొన్న ప్రతి నలుగురు యువతులలో ఒకరు (25%) క్రీడలను తమ వృత్తిగా (Career) ఎంచుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీకి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. కానీ ఇప్పుడు మహిళలు ఎక్కువగా ఆడే క్రీడగా క్రికెట్ అగ్రస్థానంలో నిలిచింది.ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 10 రెట్లు పెరుగుదల నమోదు కాగా.. మన తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) క్రికెట్‌తో పాటు బ్యాడ్మింటన్ పట్ల కూడా మహిళల్లో ఆసక్తి పెరిగినట్లు సర్వే వెల్లడించింది.

ఎందుకీ మార్పు?

భారత మహిళల క్రికెట్ జట్టు సాధిస్తున్న వరుస విజయాలు, ముఖ్యంగా హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన వంటి క్రీడాకారిణుల ప్రభావం, WPL (ఉమెన్స్ ప్రీమియర్ లీగ్) వంటి టోర్నమెంట్లు ఈ గణనీయమైన అభివృద్ధికి ప్రధాన కారణాలని విశ్లేషకులు చెబుతున్నారు.

Tags:    

Similar News