World Wrestling Championships 2025: అధిక బరువు ఎఫెక్ట్.. వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్ నుంచి ఇండియా రెజ్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఔట్

వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్ నుంచి ఇండియా రెజ్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఔట్

Update: 2025-09-15 04:09 GMT

World Wrestling Championships 2025: జాగ్రెబ్‌ (క్రొయేషియా)లో జరుగుతున్న వరల్డ్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్స్‌ 2025 నుంచి భారత రెజ్లర్‌ అమన్‌ సెహ్రావత్‌ వైదొలిగాడు. ఈ నిర్ణయం భారత జట్టుకు ఒక పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అయిన అమన్‌, పురుషుల 57 కిలోల ఫ్రీస్టైల్ విభాగంలో పోటీపడాల్సి ఉండగా అతడి బరువు 1.7 కిలోలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. నిబంధనల ప్రకారం వరల్డ్ చాంపియన్‌షిప్‌లు లేదా ఒలింపిక్స్‌లో నిర్దిష్ట బరువు కంటే ఎక్కువ ఉంటే పోటీలో పాల్గొనడానికి అనుమతించరు. ఈ కారణంగా అమన్ మ్యాచ్ ఆడకుండానే వైదొలగాల్సి వచ్చింది.

కోచ్‌లను సంప్రదించినప్పుడు, ఈ బరువు సమస్యకు అనారోగ్యం కారణమని ఆయన కోచ్ లలిత్ ప్రసాద్ వివరించారు. ఈ పరిణామం భారత రెజ్లింగ్‌కు నిరాశను కలిగించింది, ఎందుకంటే అమన్‌ సెహ్రావత్‌ మెడల్ సాధించే అవకాశాలు ఉన్న రెజ్లర్‌గా పరిగణించబడ్డాడు. ఇది గతంలో వినేష్ ఫోగట్, నేహా సంగ్వాన్‌లకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. గత నెల జరిగిన అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌20 వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌లో నెహా సంగ్వాన్ (విమెన్స్‌‌‌‌‌‌‌‌ 59 కేజీ) 600 గ్రాముల అధిక బరువుతో అనర్హతకు గురైంది.

Tags:    

Similar News