A. Revanth Reddy: ప్రధాని నరేంద్ర మోదీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ల మధ్య ఎలాంటి తేడా లేదని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముట్టతారలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన ప్రసంగించారు.

“కేరళ ప్రజలు తెలివైనవారు, అధిక విద్యావంతులు. మతతత్వ శక్తులను ఎన్నడూ అనుమతించని ఈ రాష్ట్రం అధికారంలోకి వాటిని రానీయకుండా స్పష్టమైన లక్ష్మణరేఖ గీసింది. కానీ మోదీ, పినరయి విజయన్‌ కేరళ భవిష్యత్తును నాశనం చేయాలని కుట్ర చేస్తున్నారు” అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

కేరళలో కాంగ్రెస్‌ మిత్రపక్షాలు గెలిచే అవకాశం ఉండకుండా చేయడానికి భాజపా-సీపీఎం కుట్రపన్నుతున్నాయని, భాజపా ఓటు బ్యాంకు పినరయికి బదిలీ అవుతుండగా ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Tags: