Ramchander Rao Defends Union Minister: బండి సంజయ్ తప్పు చేయలేదు: రాంచందర్‌రావు

రాంచందర్‌రావు

Update: 2026-05-18 10:56 GMT

బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డ భాజపా అధ్యక్షుడు - కేటీఆర్‌ను తీవ్రంగా విమర్శించారు

Ramchander Rao Defends Union Minister: కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై రాష్ట్రంలోని విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు తెలంగాణ భాజపా అధ్యక్షుడు రామచందర్‌రావు. వ్యక్తులు, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

సోమవారం మీడియాతో మాట్లాడుతూ రామచందర్‌రావు మాట్లాడారు. ‘‘బండి సంజయ్‌, భాజపాపై బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేస్తోంది. రూ. కోట్లు ఖర్చు చేసి రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లు వేయించింది. బండి సంజయ్‌ తప్పు చేయలేదు. ఆయన కుటుంబ సభ్యులు తప్పు చేస్తే న్యాయపరంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ సంజయ్‌ను లక్ష్యంగా చేసుకుని కేటీఆర్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అని అన్నారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో మహిళలపై నేరాల రేటు 67 శాతం పెరిగిందని గుర్తు చేశారు. ‘‘జూబ్లీహిల్స్‌ బాలిక కేసులో కేసీఆర్‌, కేటీఆర్‌ రాజీనామా చేశారా? మద్యం కేసులో మహిళ జైలుకు వెళ్తే రాజీనామా చేశారా? ఓ మహిళా సర్పంచ్‌ తనను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేస్తే పార్టీ తరపున ఏ చర్యలు తీసుకున్నారు? కేటీఆర్‌కు నైతిక విలువలు లేవు’’ అని ప్రశ్నించారు.

‘‘మీ ఇంటి ఆడబిడ్డ తప్పు చేస్తే ఎందుకు రాజీనామా చేయలేదు? ప్రజా సమస్యలపై పోరాటం చేయలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలి. కాళేశ్వరం, ఈ-కారు రేస్‌ కేసుల్లో కేసీఆర్‌, కేటీఆర్‌లను అరెస్టు చేయాలి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కలిసి ఉన్నందునే వారిని అరెస్టు చేయడం లేదు’’ అని రామచందర్‌రావు ఆరోపించారు.

Tags:    

Similar News