బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌

Update: 2025-06-21 04:33 GMT

భారతీయ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు పాడి కౌశిక్‌ రెడ్డిని వరంగల్‌ పోలీసులు శనివారం వేకువ జామున వరంగల్‌ జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. గ్రానైట్‌ వ్యాపారి మనోజ్‌ రెడ్డి ని బెదిరించి డబ్బులు డిమాండ్‌ చేశారనే ఆరోపణలపై శనివారం తెల్లవారు జామున శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ లో హుజూర్‌ నగర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిని సుబేదారి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇలా తెల్లవారుజామునే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. గ్రానైట్‌ వ్యాపారి మనోజ్‌ రెడ్డి కమలాపురం మండలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్నారు. అయితే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి గ్రైనైట్‌ వ్యాపారి మనోజ్‌రెడ్డిని బెదిరింపులకు గురి చేసి 50 లక్షల రూపాయల ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు మనోజ్‌ రెడ్డి భార్య ఉమాదేవి సుబేదారి పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా శనివారం వేకువజామున శంషాబాద్‌ విమానాశ్రయంలో సుబేదారి పోలీసులు కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసి వరంగల్‌ తరలించారు. కౌశిక్‌ రెడ్డిపై బీఎన్‌ఎస్‌ 302(2), 308(4), 352 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. కొద్ది సేపట్లో కౌశిక్‌ రెడ్డిని పోలీసులు కోర్టులో హాజరు పరచనున్నారు. అయితే తనపై తప్పుడు కేసు పెట్టారని, కక్షపూరితంగా తనను అరెస్ట్‌ చేసినట్లు విమర్శలు చేశారు. మరో పక్క కేటీఆర్‌ కూడా కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌ ని ఖండించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యే అని కేటీఆర్‌ ఆరోపించారు.

Tags:    

Similar News