MLA RAJASING : మీరు డమ్మీ కాకపోతే ఆ పని చేయండి

బీజేపీ అధ్యక్షడు రామచంద్రరావుకు ఎమ్మెల్యే రాజా సింగ్‌ సలహా;

Update: 2025-07-09 00:29 GMT

గోషామహల్‌ శాసనసభ్యుడు రాజాసింగ్‌ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్‌.రామచంద్రరావుకి ఒక సవాల్‌ విసిరారు. మిమ్మల్ని బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు డమ్మీ ప్రెసిడెంట్‌ అంటూ విమర్శిస్తుంటే నేను డమ్మీ కాదు మమ్మీ, డాడీ అని మీరు వారి ఆరోపణలను తిప్పి కొట్టారు. నిజంగా మీరు డమ్మీ కాదని నిరూపించుకోవాలంట అసదుద్దీన్‌ ఓవైసీ చెరువులో కట్టిన ఫాతీమా కాలేజి కూలగొట్టించమని రాజాసింగ్‌ సవాల్‌ చేశారు. ఈ విషయంలో ఒక లాయర్ల బృందాన్ని ఏర్పాటు చేసి న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేసి ఫాతీమా కాలేజిని చెరువులోంచి తొలగించేలా చేయాలని రాజాసింగ్‌ రామచంద్రరావును కోరారు. అలాగే హైడ్రా కమీషనర్‌ రంగనాథ్‌ ని చెరువులో ఉన్న ఫాతిమా కళాశాలను ఎందుకు కూలగొట్టలేదని అడిగితే ఆ కాలేజిలో పేదలు చదువుకుంటున్నారని కూలగొట్టలేదని చెప్పడం హస్యాస్పదంగా ఉందని రాజాసింగ్‌ అన్నారు. హైడ్రా ఎర్పడిన తరువాత మీరు ఎంతో మంది పేదల ఇళ్ళు కూల్చివేశారు… అప్పుడు పేదలు మీకు గుర్తు రాలేదా అని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ని రాజా సింగ్‌ ప్రశ్నించారు. ఈ రోజు కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీల మధ్య అనుబంధం బలపడటం కారణంగానే మీరు ఫాతిమా కాలేజి కూల్చలేక పోతున్నారని రాజా సింగ్‌ ఆరోపించారు. ఇప్పటికైనా చెరువులో నిర్మించిన ఫాతిమా కాలేజిని కూల్చివేయమని ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి అడిగారు.. ఒక వేళ కూల్చలేకపోతే ఆ కాలేజిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ కళాశాలగా ప్రకటించాలని రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు.

Tags:    

Similar News