Senior Congress Leader Jeevan Reddy: వలసవాదికి జగిత్యాల పురపాలక ఛైర్‌పర్సన్ పదవి ఇవ్వడం తీవ్ర అన్యాయం- కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి

Update: 2026-02-17 05:30 GMT

Senior Congress Leader Jeevan Reddy: వలసవాదికి జగిత్యాల పురపాలక ఛైర్‌పర్సన్ పదవి ఇవ్వడం తీవ్ర అన్యాయమని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి మండిపడ్డారు. పార్టీలో తనకు, తన అనుచరులకు నిరంతరం అవమానాలు జరుగుతున్నాయని, ఇలాంటి పరిస్థితులు ఇంకెంతకాలం భరించాలని ప్రశ్నించారు.

సోమవారం జగిత్యాలలో విలేకరులతో మాట్లాడిన ఆయన, తాను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి పనిచేస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థులుగా లేదా స్వతంత్రులుగా ఎన్నికైన తన అనుచరులను ప్రజాభవన్‌కు తీసుకెళ్లి పార్టీ అగ్రనేతలకు చూపించానని గుర్తుచేశారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారికే పురపాలక ఛైర్‌పర్సన్ పదవి ఇవ్వాలని సూచించానని చెప్పారు.

అయితే, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మనుషులకు పుర ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వడమే కాకుండా, మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవి కూడా ఇచ్చారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలకు అన్యాయం జరగడం తనను తీవ్రంగా బాధిస్తోందని వ్యాఖ్యానించారు. తనను మానసికంగా క్షోభపరుస్తున్నారని, ఇలాంటి అవమానాలను ఇంకెంతకాలం సహించాలని ఆయన ప్రశ్నించారు.

ఈ వ్యాఖ్యలు జగిత్యాలలో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Tags:    

Similar News