Harish Rao: హరీశ్‌రావు: ఫార్మా సిటీకి 17 ఎకరాలు ఇచ్చా.. రియల్ ఎస్టేట్‌కు వాడితే సహించము!

రియల్ ఎస్టేట్‌కు వాడితే సహించము!

Update: 2026-06-11 11:49 GMT

Harish Rao: ఫ్యూచర్ సిటీని 100 శాతం బీఆర్‌ఎస్ రద్దు చేస్తుందని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యం వల్ల రూ.70 వేల కోట్ల ఫార్మా పెట్టుబడులు తప్పించుకుపోయాయని ఆరోపించారు.

ఫార్మా సిటీని రద్దు చేసి భూములను రైతులకు వెనక్కి ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిందని హరీశ్‌రావు గుర్తు చేశారు. అయితే ఆ భూములను ఫార్మా సిటీ కోసం కాకుండా ఇతర ప్రయోజనాలకు మార్చాలని ప్రయత్నిస్తే చట్టం అనుమతించదని హెచ్చరించారు.

“ఫార్మా సిటీ కోసం నేను స్వయంగా 17 ఎకరాల భూమి ఇచ్చాను. ఆ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాడితే మేము ఊరుకోము” అని హరీశ్‌రావు హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే అనేక రైతులు ఈ భూములపై కేసులు వేశారని, వివాదాస్పద భూములను జర్నలిస్టులకు కేటాయించడం సరికాదని ప్రశ్నించారు. జర్నలిస్టులపై ప్రేమ ఉంటే వివాదాలు లేని భూములు ఇవ్వాలని సూచించారు.

ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు కొత్త స్థలాలు ఇచ్చినా బీఆర్‌ఎస్ వ్యతిరేకించదని, కానీ పాత వివాదాస్పద భూములను ఎందుకు ఇస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు.

Tags:    

Similar News