Heavy Rains: తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు హెచ్చరికలు
పలు జిల్లాలకు హెచ్చరికలు
Heavy Rains: తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ, ఈశాన్య తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని పేర్కొన్నారు. హనుమకొండ, జె.భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు.
ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జనగాం, కామారెడ్డి, ఖమ్మం, కుమురం భీమ్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.