Jana Nayagan: విడుదలకు సిద్దమవుతోన్న జన నాయగన్
జన నాయగన్
Jana Nayagan: తమిళనాట రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.. వెండితెరపై తన నటనతో కోట్లాదిమందిని ఉర్రూతలూగించిన దళపతి విజయ్, ఇప్పుడు ప్రజాసేవ కోసం రాజకీయ పోరాటానికి సిద్ధమయ్యారు. ఆయన తన సినీ కెరీర్‌కు ముగింపు పలుకుతూ నటిస్తున్న ఆఖరి చిత్రం.. 'జన నాయగన్.
వాస్తవానికి ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలో సందడి చేయాల్సి ఉంది. కానీ అనూహ్యంగా సెన్సార్ బోర్డు అభ్యంతరాలతో విడుదల వాయిదా పడింది. ముఖ్యంగా చిత్రంలోని ఘాటైన రాజకీయ డైలాగులు, కీలక సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమవ్వడం.. విజయ్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, సినిమా ప్రభావం రాజకీయాలపై పడకుండా మేకర్స్ జాగ్రత్త పడుతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్ డేట్ ఒకటి ఇపుడు హల్ చల్ చేస్తోంది. ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే.. అంటే ఏప్రిల్ 24వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
వేసవి సెలవులను , ఎన్నికల తర్వాత వచ్చే పొలిటికల్ వైబ్‌ని క్యాష్ చేసుకోవడానికి చిత్ర యూనిట్ ఈ డేట్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మరి విజయ్ రాజకీయ ప్రస్థానానికి ఈ 'జన నాయగన్' ఎంతటి ప్లస్ అవుతుందో చూడాలి.