Telangana Jagruti President Kavitha: ఆదాయం లేని చిన్న సంస్థతో రూ.2,250 కోట్ల ఒప్పందం ఎలా? సింగరేణి నాశనం చేస్తున్న ప్రభుత్వ చేతకానితనం: కవిత ఆరోపణ

సింగరేణి నాశనం చేస్తున్న ప్రభుత్వ చేతకానితనం: కవిత ఆరోపణ

Update: 2026-04-06 07:20 GMT

Telangana Jagruti President Kavitha: ప్రభుత్వం చేతకానితనంతో సింగరేణి సంస్థ నాశనమవుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో ఆదివారం ‘సేవ్ సింగరేణి’ అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు.

సింగరేణి కొలువుల్లో డిపెండెంట్ కార్మికుల నియామకాల విషయంలో ప్రభుత్వం మీద జోక్యం చేసుకుంటే ఊరుకోమని కవిత హెచ్చరించారు. నైనీ బ్లాక్ అవినీతి బయటపెట్టడం వల్లే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆక్రోశం పెంచుకున్నారని ఆరోపించారు. సింగరేణిని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలకు తెరలేపిందని విమర్శించారు.

రాజస్థాన్ ప్రభుత్వంతో సింగరేణి సంస్థ రూ.11 వేల కోట్ల ఒప్పందం చేసుకుందని, ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి ఖర్చుకు మూడు రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టేలా ఈ ఒప్పందం జరిగిందని కవిత చెప్పారు. మరోవైపు, లిథియం రిఫైనరీ పేరుతో రూ.27 లక్షల ఆదాయం కూడా లేని ‘ఆల్ట్ మిన్’ అనే చిన్న సంస్థతో రూ.2,250 కోట్ల ఒప్పందం ఎలా చేసుకున్నారని ప్రశ్నించారు.

కొత్త లేబర్ కోడ్‌ను అమలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని, అసెంబ్లీలో తీర్మానం చేయాలని, మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ చేశారు.

సమావేశంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, హెచ్‌ఎం‌ఎస్, ఇతర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థను కాపాడటం కోసం తీవ్రంగా పోరాడతామని కవిత స్పష్టం చేశారు.

Tags:    

Similar News